Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షావుకారు జానకి నటనను కాపీ కొట్టేశానంతే: సీనియర్ నటి గీతాంజలి

  • చలం హీరోగా చేసిన సినిమా 'సంబరాల రాంబాబు'
  • తమిళంలో ఆ పాత్రను 'షావుకారు' జానకి చేశారు
  •  తెలుగులో ఆ పాత్రను నేను చేశాను    
తెలుగు తెరపై విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషించిన సీనియర్ నటీమణుల్లో గీతాంజలి ఒకరు. హాస్యాన్ని పండించడంలోను ఆమె తన ప్రత్యేకతను చాటుకున్నారు. అలాంటి గీతాంజలి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "నేను చేసినవాటిల్లో నాకు బాగా ఇష్టమైన సినిమా 'సంబరాల రాంబాబు'. చలం కథానాయకుడిగా చేసిన ఈ సినిమాలో నేను పద్మనాభం సరసన కనిపిస్తాను.

తమిళంలో 'షావుకారు' జానకి గారు చేసిన పాత్రను, తెలుగులో నేను చేశాను. బ్రాహ్మణీకం ఉట్టిపడే పాత్రలో 'షావుకారు' జానకి గారు అద్భుతంగా చేశారు. ఆమె నడక .. మాట తీరు .. హావభావాలను గమనించి నేను తెలుగులో ఆ పాత్రను చేశాను. నటిగా నా కెరియర్లో నేను కాపీ కొట్టి చేసిన పాత్ర అదే. ఈ పాత్రను చాలా బాగా చేయాలని చలం పదే పదే చెబుతూ ఉండేవారు. ఆయనకి సంతృప్తిని కలిగించే విధంగా నేను చేయగలిగినందుకు సంతోషం కలిగింది" అని చెప్పుకొచ్చారు.
geetanjali

More Telugu News